Excitel: బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తో టీవీ ఫ్రీ.. ఎక్సైటెల్ ఆఫర్

Excitel launches new broadband plans with free smart TV or projector
  • రూ.1,299, రూ.1,499 ధరలతో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు
  • 400 ఎంబీపీఎస్ వేగంతో పరిమితి లేని డేటా
  • స్మార్ట్ టీవీ, ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ఉచితం
వైర్ లైన్ ఇంటర్నెట్ సేవలు అందించే ‘ఎక్సైటెల్’ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల పై పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 35 పట్టణాల్లో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. బిగ్ స్క్రీన్ ప్లాన్స్ పేరుతో రెండు రకాల ప్లాన్లను ప్రకటించింది. వీటిని తీసుకునే వారికి ఈ సంస్థ స్మార్ట్ టీవీతోపాటు పలు ఇతర సదుపాయాలను కూడా ఉచితంగా కల్పిస్తోంది. 

రూ.1,299
ఈప్లాన్ లో 400 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పొందొచ్చు. పైగా డేటా వినియోగానికి ఎలాంటి పరిమితి లేదు. పైగా ఈ ప్లాన్ తీసుకుంటే 16 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం. 550 లైవ్ టీవీ చానళ్ల సేవలను పొందొచ్చు. ఫ్రీ వైబర్ 32 అంగుళాల హెచ్ డీ క్లౌడ్ టీవీని పొందొచ్చు.

రూ.1,499
ఈ ప్లాన్ లోనూ 400 ఎంబీపీఎస్ వేగంతో, పరిమితి లేని డేటాతో ఇంటర్నెట్ సేవలు పొందొచ్చు. 16 ఓటీటీ సబ్ స్క్రిప్షన్, 550 లైవ్ టీవీ చానళ్ల సేవలను పొందొచ్చు. ఈ ప్లాన్ తీసుకునే వారికి ఈగేట్ కే9 ప్రో మ్యాక్స్ ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ ఉచితంగా లభిస్తుంది. డిస్నీ హాట్ స్టార్, సోనీలివ్, జీ5 తదితర అన్ని ప్రముఖ ఓటీటీ సేవలు కూడా పొందొచ్చు.
Excitel
broadband plans
smart TV
free

More Telugu News