BRS: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి.. రాజకీయ పార్టీలకు కవిత లేఖ

BRS MLC Kalvakuntla Kavitha letter to political parties on Women Reservation Bill
  • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధానాంశంగా తీసుకోవాలని విజ్ఞప్తి
  • ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులకూ లేఖ రాసిన ఎమ్మెల్సీ
  • రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఐకమత్యంతో వ్యవహరించాలని సూచన
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కృషి చేయాలంటూ అన్ని పార్టీల ముఖ్య నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ సమావేశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహా మొత్తం 47 రాజకీయ పార్టీల అధినేతలకు ఈ లేఖను పంపించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి మహిళా బిల్లు విషయంలో ఐకమత్యంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

కవిత తన లేఖలో.. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించాలని కోరారు. శాసనసభలో మహిళల ప్రాతినిధ్యం అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్యంలో కలుపుగోలుతనం ప్రాముఖ్యతను చెబుతూ, మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడమనేది ప్రత్యేకతతో కూడుకున్న అంశం కాదని అన్నారు.

బీజేపీ అధినేత జేపీ నడ్డా, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, డీఎంకే బాస్ ఎంకే స్టాలిన్, ఎన్సీపీ శరద్ పవార్, కాంగ్రెస్‌ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా రాజకీయ పార్టీల అధ్యక్షులకు కవిత ప్రత్యేక లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న బాధ్యతను గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ కవిత తన లేఖలో అభ్యర్థించారు. ఇండియా కూటమికి కూడా ఈ మేరకు కవిత అభ్యర్థన పంపారు.
BRS
MLC Kavitha
Women Reservation Bill
letter to political parties
Parliament

More Telugu News