Asia Cup: ఆసియా కప్: బంగ్లాదేశ్ పనిబట్టిన శ్రీలంక బౌలర్లు

Sri Lanka bowlers scalps Bangladesh lineup for a low score in Asia Cup encounter

  • పల్లెకెలెలో మ్యాచ్
  • నేడు గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్ ఢీ
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • 42.4 ఓవర్లలో 164 ఆలౌట్
  • 4 వికెట్లతో సత్తా చాటిన పతిరణ

ఆసియా కప్ లో నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. గ్రూప్-బిలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు పల్లెకెలె ఆతిథ్యమిస్తోంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక బౌలర్లు విజృంభించారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు తన నిర్ణయానికి ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది. 42.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో వన్ డౌన్ ఆటగాడు నజ్మల్ హుస్సేన్ శాంటో తప్పితె మరెవ్వరూ రాణించలేదు. శాంటో 122 బంతుల్లో 7 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. తౌహిద్ హృదయ్ 20 పరుగులు చేశాడు. 

బంగ్లా జట్టులో ముగ్గురు డకౌట్ అయ్యారు. బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ 5 పరుగులు చేసి నిరాశపరిచాడు. శ్రీలంక విలక్షణ పేస్ బౌలర్ మతీష పతిరణ 4 వికెట్లతో బంగ్లా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. మహీశ్ తీక్షణ 2, ధనంజయ డిసిల్వా 1, దునిత్ వెల్లాలగే 1, కెప్టెన్ దసున్ షనక 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News