arya: వెంకీ ‘సైంధవ్​’లో ఆర్య కీలక పాత్ర.. అదిరిపోయిన ఫస్ట్ లుక్​

Actor Arya is part of Venky Saindhav
  • శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న చిత్రం
  • వెంకీ కెరీర్‌‌లో ఇది 75వ  సినిమా
  • డిసెంబర్ 22న విడుదల
విష్వక్సేన్, అడివి శేష్ తో ‘హిట్’ చిత్రాలతో మంచి పేరు దక్కించుకున్న దర్శకుడు శైలేష్‌ కొలనుతో విక్టరీ వెంకటేశ్‌ చేస్తున్న చిత్ర ‘సైంధవ్’. వెంకీ కెరీర్లో ఇది 75వ చిత్రం.  వెంకట్‌ బోయనపల్లి దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్దిఖి, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియా, సారా, జయప్రకాశ్‌ నటిస్తున్నారు. ఎనిమిది కీలక పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. ఇప్పటి వరకూ ఏడు పాత్రలను పరిచయం చేశారు. తాజాగా ఎనిమిదో పాత్ర మానస్ కు సంబంధించిన గెటప్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

ఈ పాత్రను తమిళ నటుడు ఆర్య పోషిస్తున్నాడు. ఫార్మల్‌ దుస్తుల్లో, చేతిలో మెషిన్‌గన్‌తో నడుచుకుంటూ వెళుతున్న ఆర్య లుక్‌ ఆకట్టుకుంటోంది. వరుడు, రాజా రాణి, నేనే అంబానీ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న ఆర్య కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నేరుగా నటిస్తున్నాడు. కాగా, క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 22న ‘సైంధవ్‌’ విడుదల కానుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
arya
Venkatesh Daggubati
Saindhav

More Telugu News