Imran Khan: పాపం ఇమ్రాన్ ఖాన్... జైలు నుంచి విడుదలైన గంటలోపే మళ్లీ అరెస్ట్!

Another trouble for Pakistan former prime minister Imran Khan
  • తోష్ ఖానా కేసులో ఇమ్రాన్ కు ఊరట
  • ట్రయల్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేసిన హైకోర్టు
  • జైలు నుంచి ఇమ్రాన్ విడుదల
  • తాజాగా అధికారిక రహస్యాల చట్టం కింద అరెస్ట్
  • రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం 
తోష్ ఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలుశిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ కు ఆ ఆనందం కాసేపే వుంది. విడుదలైన గంటలోపే ఆయను మళ్లీ అరెస్ట్ చేశారు. అధికారిక రహస్యాల చట్టం కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను రేపు కోర్టులో హాజరు పర్చనున్నారు. 

ప్రధానిగా ఉన్న సమయంలో రాజకీయ లబ్ది కోసం రహస్యంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తోష్ ఖానా కేసు నుంచి ఊరట లభించిందని సంబరాలు చేసుకునే లోపే మరో కేసులో అరెస్ట్ చేయడం ఇమ్రాన్ మద్దతుదారులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
Imran Khan
Arrest
PTI
Toshkhana Case

More Telugu News