Jason Sanjay Vijay: దర్శకుడిగా పరిచయం అవుతోన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్

Kollywood star hero Vijay son Jason Sanjay Vijay making his directorial debut

  • లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై తొలి చిత్రం
  • జాసన్ సంజయ్ విజయ్ చెప్పిన పాయింట్ నచ్చిందన్న లైకా అధినేత
  • విజయ్ తనయుడు విదేశాల్లో సినీ కోర్సులు చేశాడని వెల్లడి
  • లైకా సంస్థ తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్న జాసన్ సంజయ్ విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తన తొలి సినిమా చేయనున్నాడు. ఈ మేరకు లైకా సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ ''సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్ నమ్ముతుంటుంది. మా బ్యానర్ లో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషంగా ఉంది. తను చెప్పిన యూనిక్ పాయింట్ నచ్చింది. 

సంజయ్ లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో బి.ఎ. (ఆనర్స్)ను పూర్తి చేశారు. అలాగే టోరంటో ఫిల్మ్ స్కూల్ లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను కంప్లీట్ చేశారు. తను మా టీమ్ కి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించింది. తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ లో స్పెషలైజేషన్ కోర్సులను చేయటం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతీ ఫిల్మ్ మేకర్ కి ఉండాల్సిన లక్షణం ఇది. 

జాసన్ సంజయ్ విజయ్ తో కలిసి వర్క్ చేయటం ఓ వండర్ ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అవుతుందని భావిస్తున్నాం. ఇందులో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు'' అని వివరించారు. 

డైరెక్టర్ జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ ''లైకా ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం. దాన్ని రూపొందించే క్రమంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు వారు తెలియజేయటం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. 

ప్రముఖ స్టార్స్, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయబోతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ గారికి థాంక్స్. ఇది నాకెంతో ఎగ్జయిట్ మెంట్ తో పాటు పెద్ద బాధ్యత. ఇదే సందర్భంలో నాకెంతో సపోర్ట్ అందించిన తమిళ్ కుమరన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అన్నాడు.

Jason Sanjay Vijay
Director
Lyca Productions
Hero Vijay
Kollywood
  • Loading...

More Telugu News