Allu Arjun: కమెడియన్ బ్రహ్మానందం నివాసానికి వెళ్లిన అల్లు అర్జున్... ఫొటోలు ఇవిగో!

Allu Arjun went to Brahmanandam residence
  • అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం
  • పుష్ప చిత్రంలో నటనకు గాను జాతీయ గుర్తింపు
  • ఇటీవల బ్రహ్మానందం చిన్న కుమారుడి పెళ్లి... హాజరు కాలేకపోయిన బన్నీ
  • అందుకే ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపిన ఐకాన్ స్టార్ 

జాతీయ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికైన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాంచి జోష్ మీద ఉన్నారు. ఆయన ఇవాళ హైదరాబాదులో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం నివాసానికి వెళ్లారు. ఇటీవల పెళ్లి చేసుకున్న బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. సిద్ధార్థ్ వివాహానికి అల్లు అర్జున్ హాజరుకాలేకపోయారు. అందుకే, ఇవాళ ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి మరీ కలిశారు. 

ఈ సందర్భంగా, జాతీయ అవార్డు గెలుచుకున్న అల్లు  అర్జున్ ను బ్రహ్మానందం అభినందించారు. ఘనంగా సత్కరించారు. బ్రహ్మానందం నివాసంలో బన్నీ దాదాపు గంటన్నర పాటు గడిపారు. బన్నీ, బ్రహ్మానందం విడిగా కూర్చుని అనేక విషయాలు ముచ్చటించుకున్నారు.

  • Loading...

More Telugu News