Ramcharan: నా ఆత్మీయులు, సన్నిహితులు క్లీన్ స్వీప్ చేశారు: రామ్ చరణ్

  • 6 జాతీయ అవార్డులు సాధించిన సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు అభినందనలు తెలిపిన చరణ్
  • 'ఉప్పెన' టీమ్ కు, వైష్ణవ్ తేజ్ కు కంగ్రాట్స్ అంటూ ట్వీట్
  • బన్నీ, డీఎస్పీలకి డబుల్ ఛీర్స్ అన్న చరణ్
Ram Charan congratulates National Awards winners

69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విజేతలకు టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు. తన ఆత్మీయులు, సన్నిహితులు క్లీన్ స్వీప్ చేశారని సంతోషం వ్యక్తం చేశాడు. 6 జాతీయ అవార్డులు సాధించిన సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు, విజనరీ డైరెక్టర్ రాజమౌళికి అభినందనలు తెలియజేశాడు. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, శ్రీనివాస్ మోహన్, కింగ్ సోలోమన్, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్, డీవీవీ దానయ్యలతో కలిసి అద్భుతమైన ప్రయాణం చేశానని చెప్పాడు. 

ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును గెలుచుకున్న 'ఉప్పెన' టీమ్ కు, వైష్ణవ్ తేజ్ కు, దర్శకుడు బుచ్చిబాబుకు అభినందనలు తెలియజేశాడు. 'పుష్ప' టీమ్ కు, తన సోదరుడు అల్లు అర్జున్ కు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు డబుల్ ఛీర్స్ అని తెలిపాడు. 'గంగూబాయ్' సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును సాధించిన అలియా భట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. డియరెస్ట్ కోస్టార్ అంటూ ఆమెను సంబోధించాడు. ఇండియన్ సినిమా గర్వపడేలా చేస్తున్న విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నానని ట్వీట్ చేశాడు.

More Telugu News