Venkatesh Daggubati: బీదర్​లో 'సైంధవ్' భారీ యాక్షన్​

saidhav team capturs action sequences in bidhar
  • దగ్గుబాటి వెంకటేశ్ హీరోగా వస్తున్న చిత్రం
  • యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న శైలేష్ కొలను 
  • డిసెంబర్ 22న విడుదల కానున్న సినిమా
‘హిట్’ చిత్రాలతో థ్రిల్లర్ జానర్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘సైంథవ్’. సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ హీరోగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, ఆండ్రియా తదితరులు నటిస్తున్నారు. తండ్రి, కూతురు మధ్య వుండే అనుబంధం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సైన్స్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బీదర్ లో ఒక పెద్ద పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. వెంకటేశ్, విలన్స్ తో పోరాటం చేసే సన్నివేశాలను దర్శకుడు శైలేష్ కొలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 22న విడుదల కానుంది.
Venkatesh Daggubati
Saindhav
sailesh kolanu
Tollywood

More Telugu News