CSK: ‘ఎక్స్’లో చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్

CSK Creates Record In X Crossed 10M Followers

  • సీఎస్కేను ‘ఎక్స్’లో ఫాలో అవుతున్న కోటిమంది
  • రెండుమూడు స్థానాల్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ
  • ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన సీఎస్కే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ‘ఎక్స్‘ (గతంలో ట్విట్టర్)లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎక్స్‌లో 10 మిలియన్ ఫాలోవర్లు సాధించిన ఏకైక జట్టుగా రికార్డులకెక్కింది. ముంబై ఇండియన్ 8.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6.8), కోల్‌కతా నైట్ రైడర్స్ (5.2), సన్‌రైజర్స్ హైదరాబాద్ (3.2) నిలిచాయి. 

పంజాబ్ కింగ్స్ (2.9), రాజస్థాన్ రాయల్స్ (2.7), ఢిల్లీ కేపిటల్స్ (2.5), లక్నో సూపర్ జెయింట్స్ (7.60 లక్షలు), గుజరాత్ టైటాన్స్ 5.52 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఐపీఎల్-2023 సీజన్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ఫైనల్‌లో గుజరాత్‌ను మట్టికరిపించి ఐదో టైటిల్‌ను సొంతం చేసుకుంది.

  • Loading...

More Telugu News