Chandrababu: ఆర్టీసీ బస్సెక్కిన టీడీపీ అధినేత చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

TDP Chief Chandrababu travels in RTC bus in Konaseema district

  • కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార కార్యక్రమానికి హాజరు
  • ఆలమూరు నుంచి జొన్నాడ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం
  • మహిళా ప్రయాణికులతో మాట్లాడిన టీడీపీ అధినేత
  • తమ మహాశక్తి పథకాన్ని మహిళలకు వివరించిన వైనం

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం విశేషం. 

ఆలమూరులో బస్సెక్కిన చంద్రబాబు జొన్నాడ వరకు ప్రయాణించారు. ఛార్జీ చెల్లించి కండక్టర్ నుంచి టికెట్ తీసుకున్నారు. బస్సులో ఆయన మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, ప్రభుత్వ పన్నులపై మహిళా ప్రయాణికులు చంద్రబాబు ఎదుట ఆవేదన వెలిబుచ్చారు. 

ఈ క్రమంలో చంద్రబాబు టీడీపీ మహాశక్తి పథకం గురించి వారికి వివరించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు ఆ మహిళలతో చెప్పగా, వారు హర్షం వ్యక్తం చేశారు.

Chandrababu
RTC Bus
Women
Dr BR Ambedkar Konaseema District
  • Loading...

More Telugu News