Ram Gopal Varma: భారత్ తో పాటు బ్రిటన్ కు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma conveys Independence day wishes to both India and Britain

  • భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు వర్మ ట్వీట్
  • భారత్, బ్రిటన్ పరస్పరం విముక్తి పొందాయని వ్యాఖ్య 
  • నెటిజన్ల నుంచి భారీ స్పందన 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పెట్టే కొన్ని పోస్టులు వివాదాస్పదంగా ఉంటాయి... మరికొన్ని పోస్టులు ఆలోచింపజేసేవి గానూ ఉంటాయి. ఏదేమైనా, వర్మ పోస్టు పెడితే చర్చ జరగాల్సిందే అన్నట్టుగా ఉంటాయి. తాజాగా, తన ట్రేడ్ మార్కుతో వర్మ ఓ పోస్టు పెట్టారు. ఇవాళ ఆగస్టు 15 సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. భారత్ తో పాటు బ్రిటన్ కు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాలూ ఒకరి నుంచి మరొకరు విముక్తి పొందిన కారణంగా భారత్, బ్రిటన్ రెండింటికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటూ ట్వీట్  చేశారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

Ram Gopal Varma
India
Britain
Independence Day
Wishes
  • Loading...

More Telugu News