Pawan Kalyan: దండుపాళ్యం బ్యాచ్‌లా వాలంటీర్ల వ్యవస్థ.. పవన్ కల్యాణ్ నిప్పులు

why are there restrictions on me that are not on criminals pawan kalyan
  • ఒంటరి మహిళల ఇళ్లకు వెళ్లి గొంతులు కోస్తున్నారన్న పవన్
  • తనపై విధించిన ఆంక్షలు వాలంటీర్లకూ విధిస్తే అరాచకాలు ఉండవని వ్యాఖ్య
  • వాలంటీర్ ఉద్యోగానికి పోలీస్ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్
వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి నిప్పులుచెరిగారు. వాలంటీర్ల వ్యవస్థ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒంటరి మహిళల ఇళ్లకు వెళ్లి గొంతులు కోస్తున్నారని ఆరోపించారు. తనపై విధించిన ఆంక్షలు వాలంటీర్లకూ విధిస్తే రాష్ట్రంలో అరాచకాలు ఉండవని అన్నారు. వాలంటీర్ ఉద్యోగానికి పోలీస్ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు.

వారాహి యాత్రలో భాగంగా విశాఖపట్నంలో పర్యటిస్తున్న పవన్..  పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలి కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధురాలిని వాలంటీర్ చంపేస్తే అధికార పక్షం నుంచి స్పందనే లేదని విమర్శించారు. 

ప్రతి కుటుంబం.. తమ పిల్లలు, మహిళల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
ఉత్తరాంధ్ర, విశాఖ నుంచే మహిళలు ఎక్కువగా అదృశ్యమవుతున్నారని అన్నారు. గతంలో మహిళల మిస్సింగ్ గురించి పరిశోధన సంస్థలు చెప్పిన గణాంకాలనే తానూ చెప్పానని అన్నారు. వ్యవస్థలో తప్పులుంటే సరిదిద్దుకోవాలని హితవుపలికారు.
Pawan Kalyan
volunteers
varahi yatra
Visakhapatnam
Janasena

More Telugu News