Chiru on Google Maps: హైదరాబాద్ నగరం గూగుల్ మ్యాప్స్‌పై చిరంజీవి! మెగాభిమానం అంటే ఇదే!

Megafans tour of hyderabad creates chiranjeevi potrait on google maps
  • చిరంజీవిపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్న మెగాఫ్యాన్స్
  • చిరంజీవి ముఖాకృతిలో గూగుల్ మ్యాప్స్‌లో రూట్ల ఎంపిక 
  • 800 కిలోమీటర్ల మేర వివిధ వాహనాల్లో ప్రయాణం, 15 రోజులపాటు సాగిన క్రతువు
  • వారి ప్రయాణమార్గాల్ని జోడించగా గూగుల్ మ్యాప్స్‌పై ఆవిష్కృతమైన చిరంజీవి చిత్రం 
మెగాస్టార్‌పై తమ అభిమానం ఎవరెస్ట్ శిఖర సమానమని మరోసారి నిరూపించారు మెగాభిమానులు. ఏకంగా గూగుల్ మ్యాప్స్‌లోనే ఆయన చిత్రాన్ని గీసి వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్ కెక్కిన మెగాభిమానం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

హైదరాబాద్ నగరం గూగుల్ మ్యాప్‌పై మెగాస్టార్ చిత్రాన్ని గీసేందుకు మెగాభిమానులు కొందరు ఆయన ముఖాకృతిని పోలిన రూట్‌మ్యాప్ ఎంచుకున్నారు. మొత్తం 800 కిలోమీటర్ల మేర చెక్ పాయింట్స్ పెట్టుకుని అనేక మంది వివిధ వాహనాల్లో గూగుల్ నావిగేషన్ ఆధారంగా ఆయా మార్గాల్లో ప్రయాణించారు. వారు ప్రయాణించిన రూట్లన్నీ కలపగా గూగుల్ మ్యాప్స్‌పై అద్భుతమైన మెగాస్టార్ చిత్రం ఆవిష్కృతమైంది. ఇందుకోసం వారు ఏకంగా 15 రోజుల పాటు శ్రమించారు. క్ష్రేత్రస్థాయిలో పర్యటించి మరీ పక్కాగా ప్లాన్ చేసిన అభిమానులు మెగాస్టార్‌కు అద్భుతమైన గిఫ్ట్ ఇస్తూ తమ అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నారు. 

మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో భోళాశంకర్ మేనియా మొదలైంది. ఈ రోజు ఉదయం నుంచి థియేటర్ల వద్ద మెగా, సినీ అభిమానుల హడావుడి మొదలైంది. తెరపై మెగాస్టార్ ను వీక్షించేందుకు తెగ ఎదురు చూస్తున్న అభిమానుల ఉత్సాహం సినిమాపై పాజిటివ్ టాక్‌తో అంబరాన్ని అంటింది.
Chiru on Google Maps
Chiranjeevi
Megafans
Viral Pics

More Telugu News