punguleti srinivas reddy: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీకి ఏపీలో విద్యుత్ లైన్ కాంట్రాక్ట్?

under ground power line contract to mp punguleti srinivasa reddys raghava constructions
  • పొంగులేటికి చెందిన కంపెనీకి ఏపీలో భూగర్భ విద్యుత్ లైన్ల టెండర్‌‌?
  • రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించేందుకు ఏపీ సర్కారు రెడీ!
  • రూ.434.94 కోట్ల అంచనాలు పెంచి అప్పగించేందుకు నిర్ణయం?  
తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఏపీలో ఓ కీలక కాంట్రాక్టు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. భూగర్భ విద్యుత్ లైన్ల టెండర్‌‌ను పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. మొదట పిలిచిన టెండర్‌‌ కంటే 434.94 కోట్ల వరకు అంచనాలు పెంచి మరీ పనులు అప్పగించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌‌సీపీ తరఫున ఖమ్మం నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. కొన్నాళ్లు వైసీపీ తెలంగాణ అధ్యక్షుడిగా పని చేశారు. తర్వాత టీ(బీ)ఆర్‌‌ఎస్‌లో చేరారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు కాంట్రాక్టులకు సంబంధించి ఏపీ సీఎంవో అధికారులను తాను కలిసినట్లు పొంగులేటి చెప్పుకొచ్చారు.
punguleti srinivas reddy
AP government
raghava constructions
power line contract
YSRCP
Congress

More Telugu News