Mahesh Babu: మహేశ్ బాబు 48వ బర్త్ డే.. నమ్రత ఆసక్తికర పోస్ట్

On Mahesh Babu 48th birthday wife Namrata shares adorable wish
  • మహేశ్ ను వెనుక నుంచి హత్తుకున్న ఫొటో ఇన్ స్టా లో పోస్ట్
  • ఈ రోజు, ప్రతి రోజూ నువ్వే, నువ్వే అంటూ క్యాప్షన్
  • హ్యాపీ బర్త్ డే ఎంబీ అంటూ శుభాకాంక్షలు
ప్రముఖ తెలుగు నటుడు మహేశ్ బాబు 48 వసంతాలు పూర్తి చేసుకుని 49వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఆగస్ట్ 9న మహేశ్ బాబు పుట్టిన రోజు కావడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన జీవిత భాగస్వామి నమ్రత శిరోద్కర్ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు సైతం మహేశ్ అందుకున్నాడు. 

ఇన్ స్టా గ్రామ్ వేదికగా మహేశ్ బాబుతో కలసి ఉన్న ఫొటోను నమ్రత పోస్ట్ చేసింది. కుటుంబమంతా కలసి వెకేషన్ కు వెళ్లిన ఫొటో అది. రాత్రి వేళ టెర్రస్ పై ఉన్న మహేశ్ ను వెనుక నుంచి హత్తుకున్న ఫొటో అది. ‘‘హ్యాపీ బర్త్ డే ఎంబీ!! ఈ రోజు, ప్రతి రోజూ నీవే, నీవే’’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

మహేశ్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలిసిందే. నటన తర్వాత కుటుంబానికే మహేశ్ బాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. తరచూ భార్య, కుమార్తె, కుమారుడితో కలసి ఆయన విదేశీ యాత్రలకు వెళ్లి వస్తుంటాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమాలో మహేశ్ బాబు నటిస్తుండడం తెలిసిందే. 2005లో అతడు, 2010లో ఖలేజా తర్వాత మహేశ్, తివ్రిక్రమ్ కలసి పనిచేస్తున్న మూడో సినిమా ఇది. మరోవైపు రాజమౌళి పాన్ ఇండియా మూవీలోనూ మహేశ్ నటించనున్నాడు. 
Mahesh Babu
birthday
Namrata
special post
instagram
wishes

More Telugu News