Tollywood: అందాల ‘చందమామ’.. పెళ్లయినా.. తల్లయినా తరగని కాజల్ అందం.. ఫొటోలు ఇవిగో!

Kajal Aggarwal latest photo shoot
  • టాలీవుడ్‌లో చాన్నాళ్లు అగ్రనటిగా ఉన్న కాజల్
  • పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరం
  • ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు సినిమాలు

లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ చాన్నాళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందింది. అటు యువ నటులతో పాటు తారక్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్ వంటి స్టార్లతో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి సీనియర్లతోనూ నటించింది. వ్యాపారవేత్త గౌతమ్‌ను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనివ్వడంతో కొన్నాళ్లు సినిమాకు దూరంగా ఉన్న కాజల్‌ పునరాగమనం చేసింది. మునుపటి అందంతో వెండితెరపై మెప్పించేందుకు సిద్ధమైంది. 
.ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో బాలకృష్ణ సరసన భగవంత్ కేసరిలో నటిస్తున్న ఆమె కమలహాసన్ పాన్ ఇండియా చిత్రం ఇండియన్2లో ఓ హీరోయిన్‌గా చేస్తోంది. హిందీలో ఉమ అనే చిత్రంతో పాటు నాయికా ప్రాధాన్యం ఉన్న సత్యభామ అనే తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా ఫొటో షూట్లలో మెరుస్తోంది. తాజాగా చీరకట్టులో ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. మునుపటి అందంతో కనిపిస్తున్న కాజల్ ఫొటోలు చూస్తుంటే ఆమెకు పెళ్లయి, ఓ బిడ్డకు తల్లి అంటే నమ్మబుద్ది కావడం లేదు.  
.

  • Loading...

More Telugu News