amazon: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పై ఆగస్ట్ 15 సందర్భంగా ప్రత్యేక సేల్స్

amazon and flipkart gearing for independence day special sales
  • గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో అమెజాన్ విక్రయాలు
  • 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహణ
  • బిగ్ సేవింగ్ డేస్ తో ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక అమ్మకాలు
  • 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహణ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరోసారి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు విక్రయాల పండుగను మొదలు పెట్టబోతున్నాయి. అమెజాన్ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ పేరుతో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఆఫర్ సేల్ నిర్వహిస్తోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఆ ఆఫర్ సేల్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకే అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ లో భాగంగా అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.

శామ్ సంగ్ గెలాక్సీ ఎం14 5జీ, వన్ ప్లస్ నార్డ్ 3, వన్ ప్లస్ 11 ఆర్, రియల్ మీ నార్జో 60 ప్రో, గెలాక్సీ ఎం04, వన్ ప్లస్ 11, ఐకూ నియో 7 5జీ, రెడ్ మీ నోట్ 12 5జీ, ఐకూ జెడ్7ఎస్, రియల్ మీ నార్జో ఎన్55, ఐకూ జెడ్ 6 లైట్ తదితర మోడళ్లపై మంచి ఆఫర్లు రానున్నాయి.  వీటి ధరలను ఇంకా ప్రకటించలేదు. ఎస్ బీఐ క్రెడిట్ కార్డుతో చెల్లింపులపై 10 శాతం డిస్కౌంట్ వస్తుంది. ల్యాప్ టాప్ లపై 75 శాతం వరకు, స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. యాపిల్ ఉత్పత్తులు, టీవీలు, రిఫ్రిజిరేటర్లపైనా మంచి ఆఫర్లు రానున్నాయి. 

మరోవైపు ఫ్లిప్ కార్ట్ సైతం ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. పేటీఎం చెల్లింపుల పైనా ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. టీవీలు, అప్లయన్సెస్ పై 75 శాతం వరకు డిస్కౌంట్ రానుంది. విడిగా ఒక్కో ఉత్పత్తికి సంబంధించిన ఆఫర్లు 3వ తేదీన తెలిసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News