Stock Market: సెన్సెక్స్ కు స్వల్ప నష్టాలు.. నిఫ్టీకి స్వల్ప లాభాలు

Markets ends in flat mode

  • కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన ఇన్వెస్టర్లు
  • 29 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 8 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడుతుండటం, వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడ్ నిర్ణయం వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 29 పాయింట్లు నష్టపోయి 66,355కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు లాభపడి 19,680 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: 
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.33%), టాటా స్టీల్ (3.25%), ఎన్టీపీసీ (2.45%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.12%), టైటాన్ (1.70%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-4.01%), ఐటీసీ (-1.85%), ఎల్ అండ్ టీ (-1.67%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.27%).

  • Loading...

More Telugu News