Jagan: వాలంటీర్లపై వ్యాఖ్యలు: పవన్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన ఏపీ సీఎం జగన్

cm jagan strong counter pawan kalyan over volunteer comments
  • బాబు, దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది క్యారెక్టర్స్ ఎలాంటివో అందరికీ తెలుసన్న జగన్
  • పెళ్లిళ్లు చేసుకోవడం, వదిలేయడం పవన్‌ క్యారెక్టర్‌ అంటూ మండిపాటు
  • బాబుకు పదేళ్లుగా వాలంటీర్ గా ఉంటున్న ప్యాకేజి స్టార్ అంటూ ఎద్దేవా
  • వాలంటీర్ల క్యారెక్టర్ గురించి కోట్ల మంది ప్రజలకు తెలుసని వ్యాఖ్య
వాలంటీర్ల వ్యవస్థ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. పెళ్లిళ్లు, విడాకులు, అక్రమ సంబంధాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వాలంటీర్ పవన్ అంటూ సెటైర్లు వేశారు. తిరుపతి వెంకటగిరిలో చేనేత నేస్తం పథకం లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

‘‘వాలంటీర్ల సేవలను తప్పుబడుతున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది క్యారెక్టర్స్ ఎలాంటివో అందరికీ తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా? పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం పవన్‌ కల్యాణ్‌ క్యారెక్టర్‌. అలాంటి వ్యక్తా వాలంటీర్ల గురించి మాట్లాడేది? ఒకరిని వివాహం చేసుకుని.. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకునే వ్యక్తా వలంటీర్ల వ్యక్తిత్వం గురించి మాట్లాడేది?” అంటూ మండిపడ్డారు. 

‘‘మరొకడేమో యూట్యూబ్ లో డ్యాన్సులు చేస్తూ కనిపిస్తాడు. ఇంకొకడేమో ‘అమ్మాయిలు కనిపిస్తే ముద్దులు పెట్టుకోవాలి.. కడుపు చేయాలి’ అంటాడు. ఒకరు టీవీ షోకి వెళ్లి ‘బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేశాను’ అంటాడు” అని విమర్శలు చేశారు. ‘‘ఒక్కడిదేమో బీజేపీతో పొత్తు.. చంద్రబాబుతో సంసారం. ఇచ్చేది బీ ఫామ్.. టీడీపీకి బీ టీం” అని ఎద్దేవా చేశారు. 

‘‘వాలంటీర్ల క్యారెక్టర్ గురించి కోట్ల మంది ప్రజలకు తెలుసు. వాలంటీర్ల క్యారెక్టర్ ను తప్పుబట్టింది బాబుకు పదేళ్లుగా వాలంటీర్ గా ఉంటున్న ఈ ప్యాకేజి స్టార్ అని పవన్ పై విమర్శలు గుప్పించారు. ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagan
pawan kalyan
Chandrababu
volunteers
YSRCP
Janasena
Telugudesam

More Telugu News