Exercise: వారానికి రెండు రోజుల వ్యాయామంతోనూ గుండెపోటు దూరం!

Todays Hard Exercise Is Equal To 7days Excercise

  • 90 వేల మందిపై జరిపిన అధ్యయనంలో వెల్లడి
  • వారంలో రెండు రోజులు తీవ్రస్థాయిలో వ్యాయామంతోనూ హృద్రోగ సమస్యలు దూరం
  • వారమంతా సాధారణ స్థాయి వ్యాయామం, రెండు రోజుల తీవ్రస్థాయి వ్యాయామంతో సమానమంటున్న నిపుణులు

రోజూ ఊపిరి సలపని పనులు, ఉరుకుల పరుగుల జీవితం, రాత్రి ఉద్యోగాలు వంటి కారణాలతో చాలామంది వ్యాయామానికి దూరమవుతున్నారు. ఇలాంటి వారు తీరిక చేసుకుని వారానికి రెండు రోజులు వ్యాయామం కోసం సమయం కేటాయిస్తే గుండెపోటు, పక్షవాతం ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా హార్ట్ అసోసియేషన్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే, చేసే ఆ రెండు రోజులు ఏదో చేశామనిపించామని కాకుండా కాస్తంత తీవ్రంగా చేయడం మేలని పేర్కొన్నాయి. మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం వారానికి 150 నిమిషాల వ్యాయామం అవసరమని పేర్కొంది.

వారమంతా సాధారణ వ్యాయామాన్ని కొనసాగించాలా? లేదంటే వారంలో రెండు, మూడు రోజులు చేయడం ద్వారా పూర్తిస్థాయి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చా? అనే విషయాన్ని తేల్చేందుకు 2013-2015 మధ్య బ్రిటన్ శాస్త్రవేత్తలు 62 ఏళ్ల సగటు వయసున్న దాదాపు 90 వేల మందిపై అధ్యయనం నిర్వహించారు.  వారమంతా వ్యాయామం చేసినా, వారంలో ఒకటి రెండు రోజులు తీవ్రస్థాయిలో కసరత్తులు చేసినా ఆరోగ్యంపై దాని ప్రభావం సమాన స్థాయిలోనే ఉన్నట్టు గుర్తించారు. గుండెపోటు, పక్షవాతం, ఎట్రియల్ ఫైబ్రిలేషన్, మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ వంటి హృదయ సంబంధిత సమస్యల ముప్పు ఒకేలా తగ్గుతుందని గుర్తించారు.

Exercise
Health
Heart Diseases
  • Loading...

More Telugu News