Chattisgarh: ప్రియుడి కోసం బిడ్డతో కలిసి భారత్‌కు వచ్చిన మరో విదేశీ మహిళ

Polish woman living with her lover in Chattisgarh village intends to take him home
  • పోలాండ్‌ మహిళ పోలాక్‌కు ఝార్ఖండ్ వాసి మహ్మద్ షాదాబ్‌తో ఇన్‌స్టాలో పరిచయం
  • మహిళకు అప్పటికే భర్త, బిడ్డ
  • పరిచయం ప్రేమగా మారి ప్రియుడితో కలిసి జీవించేందుకు నిర్ణయం
  • భర్తతో విడాకుల తరువాత బిడ్డను తీసుకుని ప్రియుడి స్వగ్రామానికి వచ్చేసిన మహిళ
  • త్వరలో అతడిని తనతో పోలాండ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నం
ప్రేమ కోసం మరో విదేశీ మహిళ పిల్లలతో కలిసి భారత్ వచ్చేసింది. పోలాండ్‌కు చెందిన పోలాక్ బార్బరాకు(45) ఝార్ఖండ్‌కు చెందిన మహ్మద్ షాదాబ్(35)‌తో 2021లో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. బార్బరాకు అప్పటికే వివాహమై ఓ బిడ్డ(6) కూడా ఉన్నారు. కాగా, మహ్మద్‌తో పోలాక్‌ పరిచయం ప్రేమగా మారడంతో ఆమె ప్రియుడితో కలిసి ఉండేందుకు నిర్ణయించింది. భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన బిడ్డ సహా హజారీబాగ్‌లోని ప్రియుడి స్వగ్రామమైన ఖుత్రాకు వచ్చేసింది. ప్రస్తుతం అతడితో కలిసి ఉంటోంది. 

అయితే, ఇక్కడి వేడిమిని పోలాక్ తాళలేకపోవడంతో మహ్మద్ ఆమె కోసం ఇంట్లో ఓ ఏసీ కూడా ఏర్పాటు చేశాడు. మరోవైపు తన ప్రేమ సాకారమైనందుకు ఆమె హర్షం వ్యక్తం చేసింది. ‘‘భారత్ చాలా అందమైన దేశం, ఇక్కడి ప్రజలు ప్రేమ గలవారు. నన్ను చూసేందుకు రోజూ వందలాది మంది వస్తున్నారు’’ అని ఆమె చెప్పింది. కాగా, ఖండాంతర ప్రేమ వ్యవహారంపై హరీబాగ్ జిల్లా డీఎస్పీ రాజీవ్‌కుమార్ కూడా ఆరా తీశారు. ఖుత్రా గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. ‘‘నేను పోలాక్‌తో మాట్లాడాను. మరికొన్ని రోజుల్లో ఆమె పోలాండ్ వెళ్లనుంది. ఆ తరువాత షాదబ్‌కు వీసా వచ్చాక అతడినీ తనతో పోలాండ్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది’’ అని ఆయన తెలిపారు.
Chattisgarh

More Telugu News