Srinidhi Shetty: 'కేజీఎఫ్‌ హీరోయిన్‌ సీక్రెట్ మ్యారెజ్' అంటూ పుకార్లు.. విషయం ఏంటని ఆరా తీస్తే..!

Photos of Srinidhi shetty goes viral sparking rumors of her secret marriage

  • పాపిట సింధూరం ధరించిన ఫొటోలు షేర్ చేసిన శ్రీనిధి
  • ఫొటోలు చూసి నెటిజన్ల షాక్
  • శ్రీనిధికి పెళ్లయిపోయిందంటూ వార్త వైరల్
  • పెళ్లకాని యువతులూ పాపిట సింధూరం ధరిస్తారని తెలిసి వదంతులకు ఫుల్ స్టాప్

కేజీఎఫ్ సినిమాతో ఓవర్‌నైట్ పాప్యులారిటీ సొంతం చేసుకున్న కన్నడ నటి శ్రీనిధి శెట్టి. ఈ మూవీలో యశ్‌కు జోడిగా నటించిన ఆమెకు బోలెడన్ని ప్రశంసలు దక్కాయి. కేజీఎఫ్ క్రేజ్‌తో ఆమెకు తొలుత వరుస ఆఫర్లు వచ్చినా ఆ తరువాత అమ్మడి స్పీడుకు ఎందుకో కాస్త బ్రేక్ పడింది. కానీ, ఆమె మాత్రం నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. తరచూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. 

అయితే, ఇటీవల శ్రీనిధి ఫొటోలు చూసిన కొందరు ఆమె రహస్య వివాహం చేసుకుందంటూ రచ్చ రచ్చ చేయడం మొదలెట్టారు. శ్రీనిధి పాపిట సింధూరం ధరించి ఉన్న ఫొటోలను షేర్ చేయడమే ఇందుకు కారణం. పాపిట సింధూరాన్ని వివాహిత మహిళలే పెట్టుకుంటారు కాబట్టి శ్రీనిధి సీక్రెట్‌గా తాళి కట్టించేసుకుందంటూ జనాలు రెచ్చిపోయారు. 

కానీ, ఈ వదంతులకు త్వరగానే ఫుల్ స్టాప్ పడింది. కర్ణాటకకు చెందిన శ్రీనిధి తుళు కుటుంబంలో జన్మించిన విషయం తెలిసిందే. తుళు సంప్రదాయం ప్రకారం, కొన్ని సందర్భాల్లో పెళ్లికాని యువతులు కూడా పాపిట సింధూరం ధరిస్తారు. శ్రీనిధి కూడా ఇదే విధంగా బొట్టుపెట్టుకుని ఉంటుందని, కాబట్టి ఎక్కువ ఊహించేసుకునేందుకు అక్కడేమీ లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒక్క ఫొటోతో మళ్లీ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది శ్రీనిధి.

Srinidhi Shetty
Viral Pics
Mollywood
  • Loading...

More Telugu News