Boy Kidnap: రాజేంద్రనగర్‌లో 12 ఏళ్ల బాలుడి అదృశ్యం.. కిడ్నాప్‌గా అనుమానం

Boy Missing in Rajendranagar Hyderabad
  • చిట్టీడబ్బులు ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని బాలుడు
  • రాత్రంతా గాలించినా ఫలితం శూన్యం
  • కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో 12 ఏళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. రాత్రి నుంచి గాలిస్తున్నా ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో కిడ్నాప్ అయి ఉంటాడని భావిస్తున్నారు. సాయిచరణ్ అనే బాలుడు గత రాత్రి చిట్టీ డబ్బులు ఇచ్చేందుకు బయటకు వెళ్లాడు. అలా వెళ్లిన చరణ్ రాత్రి పొద్దుపోయినా రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాతంత్రా బాలుడి కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సాయిచరణ్ బాలుడు కావడంతో కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News