Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు... శిలాతోరణం వరకు క్యూ లైన్

Huge rush of pilgrims in Tirumala
  • నిన్న రెండో శనివారం... నేడు ఆదివారం
  • తిరుమల కొండపై భక్తుల రద్దీ
  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు
  • శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
నిన్న రెండో శనివారం, నేడు ఆదివారం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. గత రెండ్రోజులుగా భక్తులు భారీగా తరలి వస్తుండడంతో కొండపై రద్దీ నెలకొంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. అటు, నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోగా, భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు ఉంది. భక్తులు తండోపతండాలుగా వచ్చిన నేపథ్యంలో, టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. 

కాగా, నిన్న తిరుమల శ్రీవారిని 86,781 మంది దర్శించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ రూపంలో రూ.3.47 కోట్ల ఆదాయం లభించింది.

More Telugu News

Tirumala
Devotees
Rush
Weekend
Lord Venkateswara
TTD