kiss: లాంగెస్ట్ కిస్ వరల్డ్ రికార్డ్‌ను ఎందుకు నిలిపేశారో తెలుసా? నిబంధనలు వింటే షాకవుతారు...!

Longest Kiss World Record Contest Was Discontinued

  • గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నవీకరించబడిన విధానాలకు విరుద్ధంగా ఈ పోటీ
  • ముద్దుల పోటీలో పాల్గొంటే ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలి
  • ఏ సమయంలోను పెదాలు విడిపోకూడదు
  • టాయిలెట్‌కు వెళ్లవచ్చు... కానీ పెదాలు విడిపోకూడదు!

లాంగెస్ట్ కిస్ వరల్డ్ రికార్డ్ కేటగిరీ ఉందని మీకు తెలుసా? అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనిని 2013లో నిలిపివేసింది. దీనిని నిలిపివేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఈ పోటీ ప్రమాదకరంగా ఉండటంతో పాటు, నవీకరించబడిన విధానాలకు కొన్ని నియమ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయి. లాంగెస్ట్ కిస్ వరల్డ్ రికార్డ్ కోసం నియమాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో పేర్కొన్న విధంగా ముద్దు నిరంతరం ఉండాలి. ఇరువురి పెదవులు ఎల్లవేళలా తాకుతూ ఉండాలి. ఒక్కసారి పెదవులు విడిపోయినా ఆ జంట అనర్హులు అవుతారు. ఈ పోటీలో పాల్గొన్నవారు గంటలతరబడి ఉంటారు. కాబట్టి స్ట్రా ద్వారా ద్రవపదార్థాలు తీసుకోవచ్చు. ఆ సమయంలోనూ పెదాలు విడిపోకూడదు.

ఈ పోటీలో పాల్గొనే కపుల్స్ మెలకువతోనే ఉండాల్సి ఉంటుంది.

పోటీలో పాల్గొన్నంతసేపు వారు నిలబడి ఉండాలి. ఇతరులు ఎవరు వారికి సహాయంగా ఉండరాదు.

విశ్రాంతి తీసుకోవడానికి అనుమతుల్లేవు.

అడల్ట్ డైపర్స్ లేదా ఇతర ప్యాడ్లు ధరించరాదు. జంటలు టాయిలెట్ కు వెళ్లవచ్చు. కానీ ఆ సమయంలోను వారి పెదవులు విడిపోకూడదు.

విరామం లేనందున ఈ పోటీలో పాల్గొనేవారు నిద్రపోకుండా, నిలబడి ఉండవలసి వస్తుంది. ఇది మున్ముందు ఇబ్బందికరం.

కాగా, లాంగెస్ట్ కిస్ వరల్డ్ రికార్డ్ కు బదులు లాంగెస్ట్ కిస్సింగ్ మారథాన్ ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకు వచ్చింది.

1999లో ఇజ్రాయెల్ కు చెందిన కర్మిత్ జుబెరా - డ్రోర్ ఆర్పాజ్ జంట 30 గంటల 45 నిమిషాల పాటు ముద్దు పెట్టుకున్నారు. ఈ పోటీలో వారు గెలిచినప్పటికీ, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ జంట 2,500 డాలర్ల ప్రైజ్ మనీతో పాటు, ప్రపంచ పర్యటన చాన్స్ గెలుచుకుంది.

2013లో థాయ్ లాండ్ జంట ఎక్కాచై - లక్సన తిరానారత్ వరల్డ్ లాంగెస్ట్ కిస్ రికార్డును నెలకొల్పారు. వారు 58 గంటల 35 నిమిషాల పాటు ముద్దు పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News