Child Kidnap: హైదరాబాద్‌లో బాలిక కిడ్నాప్ కలకలం!

Girl playing infront of her house goes missing in medchal

  • మేడ్చల్‌లో ఇంటి ముందు ఆడుకుంటూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన బాలిక
  • పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు 
  • బాలికను కిడ్నాప్ చేశారేమోనని ఆందోళన
  • సీసీటీవీ ఫుటేజీతో బాలిక కోసం పోలీసుల గాలింపు

హైదరాబాద్‌లో తమ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి అపహరణకు గురైన ఉదంతం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మేడ్చల్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో చిన్నారి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటిదాకా ఆడకుంటున్న చిన్నారి అదృశ్యమైందంటూ వారు కన్నీటిపర్యంతమయ్యారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాలిక జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

మరోపక్క, నిన్న పెద్ద అంబర్ పేట్‌ హైవే చెక్ పోస్ట్ వద్ద వెలుగు చూసిన బాలిక కిడ్నాప్ ఉదంతం నగర వాసులను ఉలిక్కిపడేలా చేసింది. బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేయగా వారి నుంచి కష్టపడి తప్పించుకున్న బాలిక వీధిలో నిలబడి వచ్చిపోయే వారి సాయం కోసం అర్థించింది. బాలిక దుస్థితి చూసినా ఒక్కరూ స్పందించకపోవడంతో చలించిపోయిన ఓ హిజ్రా చేయూతనందించాడు. హిజ్రా వద్ద ఫోన్ తీసుకున్న బాలిక తన అన్నకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. దీంతో, బాలిక కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిందితుల నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.

Child Kidnap
Hyderabad
Telangana
Andhra Pradesh
Crime News
  • Loading...

More Telugu News