Samantha: ప్రేమ గురించి సమంత పోస్టు... కొద్దిసేపట్లోనే వైరల్

Samantha post about love went viral
  • 2021లో నాగచైతన్య నుంచి సమంత విడాకులు
  • ఒంటరి జీవితం గడుపుతున్న సమంత
  • తాజాగా లవ్ కొటేషన్ తో కలకలం రేపిన వైనం
టాలీవుడ్ నటి సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు అత్యంత చర్చనీయాంశంగా మారింది. సమంత ప్రేమ గురించి పోస్టు చేయడమే అందుకు కారణం. అక్కినేని నాగచైతన్యతో వైవాహిక జీవితానికి రెండేళ్ల కిందట చరమగీతం పాడిన సమంత... అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతోంది. 

అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ప్రేమ గురించి పోస్టు చేయడంతో, తీవ్రస్థాయిలో ఊహాగానాలు బయల్దేరాయి. సమంత మళ్లీ ప్రేమలో పడిందా? అన్నదే ఆ ఊహాగానాల సారాంశం. 

సమంత ఇన్ స్టాలో ప్రఖ్యాత పాశ్చాత్య రచయిత పాబ్లో నెరూడా కొటేషన్ ను పంచుకుంది. "మనల్ని మరణం నుంచి ఏదీ రక్షించలేకపోతే, కనీసం ప్రేమ అయినా మనల్ని జీవితం నుంచి కాపాడాలి కదా!" అన్నదే ఆ పోస్టు పరమార్థం. ఈ కొటేషన్ కు తోడుగా సమంత ఇద్దరు లవర్స్ కలిసున్న ఫొటోను పంచుకోవడంతో కొద్దిసేపట్లోనే ఇది వైరల్ అయింది. 
Samantha
Love
Pablo Neruda
Quotation
Tollywood

More Telugu News