వివేకా హత్య కేసులో కీలక పరిణామం... సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వివేకా హత్య కేసులో కీలక పరిణామం... సుప్రీంకోర్టును ఆశ్రయించిన దస్తగిరి

Dastagiri requests leagal assistance in Supreme Court
  • వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి
  • నోటీసులు పంపిన సుప్రీంకోర్టు
  • తనకు న్యాయ సహాయం కల్పించాలంటూ దస్తగిరి విజ్ఞాపన
  • సుప్రీంకోర్టులో న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమత తనకు లేదని వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తన ఆర్థిక స్తోమత అంతంతమాత్రమేనని, అందుకే తనకు న్యాయ సహాయం అందించాలని సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి విజ్ఞాపన పంపాడు. 

వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన పీఏ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. వివేకా హత్యపై మొదట ఫిర్యాదు చేసింది తానే గనుక బాధితుడిగా చూడాలని కోరారు. కానీ కృష్ణారెడ్డి అభ్యర్థనను వివేకా కుమార్తె సునీత వ్యతిరేకించారు. అదే సమయంలో సీబీఐకి, అప్రూవర్ గా మారిన దస్తగిరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

ఈ నోటీసుల నేపథ్యంలోనే దస్తగిరి స్పందిస్తూ, తనకు న్యాయ సహాయం అందించాలని అర్థించాడు. సుప్రీంకోర్టులో తన తరఫున న్యాయవాదిని నియమించుకునేంత ఆర్థిక స్తోమత తనకు లేదని దస్తగిరి తెలిపాడు. అందుకే తనకు న్యాయ సహాయం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు.
Advertisement
Dastagiri
Legal Help
Supreme Court
Viveka Murder Case

More Telugu News