Fasi: హైదరాబాదులో ఉగ్రవాద లింకులున్న తండ్రి, కూతురు అరెస్ట్

Father and daughter arrest who have alleged links with ISKP

  • భాగ్యనగరంలో ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు
  • పాతబస్తీ వాసి ఫసీతో పాటు ఆయన కుమార్తెను అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ 
  • ఐఎస్ కేపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న తండ్రి, కూతురు

హైదరాబాబాదులో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. భాగ్యనగరంలో ఐఎస్ కేపీ ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేశారు. పాతబస్తీ టోలీచౌకి వాసి ఫసీ, ఆయన కుమార్తె ఐఎస్ కేపీ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు గుర్తించారు. 

సూరత్ కు చెందిన సుబేరా బాను, శ్రీనగర్ కు చెందిన నాజిర్, హయత్, అజీమ్ లతో కలిసి వీరు ఓ గ్రూపుగా ఏర్పడినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడమే వీరి లక్ష్యంగా తెలుస్తోంది. వీరిని విచారిస్తే మరిన్ని లింకులు వెల్లడవుతాయని భావిస్తున్నారు.

Fasi
Daughter
ISKP
ATS
Hyderabad
Gujarat
  • Loading...

More Telugu News