Mamata Banerjee: మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Helicopter on boarded Mamata Banerjee made emergency landing
  • బాగ్డోగ్రా నుంచి హెలికాప్టర్ లో జల్పాయ్ గురి బయల్దేరిన మమతా బెనర్జీ
  • పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు
  • ప్రతికూల వాతావరణంతో సలుగరా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • రోడ్డుమార్గంలో వెళ్లిపోయిన పశ్చిమ బెంగాల్ సీఎం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. దాంతో హెలికాప్టర్ ను మార్గమధ్యంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బాగ్డోగ్రా ప్రాంతంలో ఓ సమావేశంలో పాల్గొన్న సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ లో జల్పాయ్ గురి బయల్దేరారు. 

అయితే భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్ ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆకాశం మేఘావృతమై ఉండడంతో సలుగరా ఆర్మీ ఎయిర్ బేస్ లో హెలికాప్టర్ ను అత్యవసరంగా కిందికి దించారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో మమతా బెనర్జీ కోల్ కతా తిరిగి వెళ్లారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

More Telugu News

Mamata Banerjee
Helicopter
Emergency Landing
Rains
West Bengal