TIDCO: టిడ్కో ఇళ్లపై వైసీపీ రంగులపై కేంద్ర మంత్రి ఆగ్రహం.. మోదీ ఫొటో పెట్టాలని ఆదేశం

Union minister Bharathi anger over YSRCP colours on TIDCO houses
  • పాలకొల్లులో టిడ్కో ఇళ్లను పరిశీలించిన భారతి ప్రవీణ్ పవార్
  • టిడ్కో ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోందని వ్యాఖ్య
  • ప్రతి గృహ సముదాయంపై మోదీ ఫొటో, పీఎంఏవై లోగో ఉండాలని ఆదేశం
కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమైన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయండంపై కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకం కింద నిధులను మంజూరు చేస్తోందని... అలాంటప్పుడు గృహ సముదాయం వద్ద ప్రధాని మోదీ ఫొటో, పీఎంఏవై లోగో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి గృహ సముదాయంపై ఇది ఉండాలని ఆదేశించారు. కేంద్ర మంత్రి ఈరోజు పాలకొల్లులోని టిడ్కో ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పైవిధంగా స్పందించారు. 

TIDCO
Houses
YSRCP Colours
Union Minister
BJP
Modi Photo

More Telugu News