Rihanna: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెడచుట్టూ వాచీ ధరించిన రిహన్నా.. ధర తెలిస్తే గుండె వేగం పెరగడం ఖాయం!

Rihanna wears nearay 6 crore diamond watch around her neck

  • మెడకు చోకర్‌లా వాచీ ధరించి క్యాట్‌వ్యాక్
  • వాచ్‌కు 368 వజ్రాలు
  • ధర దాదాపు రూ. 5.7 కోట్లు

అమెరికన్ సింగర్, నటి రిహన్నా పారిస్ ఎల్వీ ఫ్యాషన్ వీక్‌లో మెడకు ధరించిన వాచీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెల్లగా, అందంగా మెరిసిపోతున్న ఆ వాచ్ అందరి మనసులను కొల్లగొట్టింది. జాకోబ్ అండ్ కో వాచ్ కంపెనీ దీనిని తయారుచేసింది. దీని విలువ దాదాపు రూ. 5.7 కోట్లు. 

వాచీని మెడకు చోకర్‌లా ధరించడం ఇదే తొలిసారి. మొత్తం 368 వజ్రాలు పొదిగిన  47 మిల్లీమీటర్ల వైట్ గోల్డ్ బ్రిలియంట్ ఫ్లైయింగ్ టూర్‌బిల్లన్‌ను చోకర్‌గా ధరించడానికి వీలుగా తయారుచేశారు. కాగా, రెండోసారి గర్భవతి అయిన రిహన్నా డెనిమ్ షర్ట్, జీన్స్, భారీ జాకెట్, బీనీలో బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ క్యాట్‌వాక్ చేసింది. 

వాచ్‌ను మరింత స్పష్టంగా వీక్షించేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Rihanna
American Singer
American Actor
Watch Choker
  • Loading...

More Telugu News