Hyderabad: సాగర్ రింగ్ రోడ్డు ఫ్లై ఓవర్ కూలి పది మందికి గాయాలు

Ten people injured in flyover collapse on Sagar Ring Road

  • ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్
  • రెడీ మిక్స్ లారీ తగిలి ఫ్లైఓవర్ పైకి ఎక్కే ర్యాంప్ కూలిన వైనం
  • ముగ్గురి పరిస్థితి విషమం!

హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ రింగ్ రోడ్డులో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ లో నిన్న అర్ధరాత్రి కొంత భాగం కూలిన ఘటనలో పది మందికి గాయాలు అయ్యాయి. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బైరామల్ గూడా వైపు నుంచి ఫ్లై ఓవర్ పైకి వెహికిల్స్ ఎక్కే ర్యాంప్ కుప్పకూలింది. 

రెండు పిల్లర్లకు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ కూలడంతో దానిపై పనులు చేస్తున్న కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలుస్తోంది.

Hyderabad
LB Nagar
Sagar Ring Road
flyover collapse
  • Loading...

More Telugu News