Japan: జపాన్ వాసుల దీర్ఘాయువు కిటుకు.. రోజూ 5 నిమిషాల వ్యాయామం!

5 minute exercise the longest living people in Japan do every single day Radio taiso
  • శరీరానికి కదలికలు కూడా ఎంతో ముఖ్యమంటున్న జపనీయులు
  • అది ఆరోగ్యానికి మంచి చేస్తుందన్న అభిప్రాయం
  • రేడియోలో రోజూ కార్యక్రమం ద్వారా నేర్పే ప్రయత్నం
దీర్ఘాయుష్మాన్ భవ.. పెద్దలు, పండితులు ఇలానే దీవిస్తుంటారు. అంటే చిరాయువుగా జీవించమని అర్థం. కానీ, నేడు సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ, ఎన్నో అనారోగ్య సమస్యలతో నెట్టుకొచ్చే వారే ఎక్కువ. కానీ, జపాన్ వాసులు అలా కాదు. ఇతర ప్రపంచ వాసులతో పోలిస్తే మెరుగైన ఆరోగ్యంతో, అధిక కాలం పాటు జీవిస్తుంటారు. ఎక్కువ మంది 90-100 ఏళ్ల వరకు జీవించే వారే. 

దీర్ఘాయువుకు తీసుకునే ఆహారం, అనుబంధాలు, సానుకూల దృక్పథం తో పాటు శారీరక వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుందని జపాన్ వాసులను చూస్తే అర్థం అవుతుంది. జపాన్ లోని ఒకినవా ప్రాంతంలో ఎక్కువ మంది శతాయుష్షుతో ఉండడం గమనించొచ్చు. వ్యాయామం చేయాలంటే జిమ్ కు వెళ్లి కసరత్తులు చేయాలనుకోవడం పొరపాటే. జపాన్ వాసులకు జిమ్ తో పని లేదు. ఓ పనిముట్టూ అవసరం లేదు. శరీరానికి తగిన కదలికలు ఉండేలా చూసుకుంటారంతే. 

రోజులో మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల పాటు శరీరాన్ని కదలించాల్సి ఉంటుంది. వీల్ చైర్ లో ఉన్నవారు కూడా శరీరాన్ని కదలించే చర్యలు చేస్తుంటారు. 1929లోనే శరీరాన్ని ఎలా కదిలించాలో రేడియో ద్వారా జపాన్ ప్రజలకు చెప్పేవారు. దీనికి రేడియో ఎక్సర్ సైజెస్ అని పేరు. ఈ రేడియో టైసో కార్యక్రమం ఇప్పటికీ ఉదయం 6.30 గంటలకు జపాన్ లో ప్రసారం అవుతుంది. జపాన్ లోనే అతి పురాతన రేడియో స్టేషన్ ఎన్ హెచ్ కే రేడియో 1 ప్రసారం చేస్తుంది. ఈ వ్యాయామాలు చేయడానికి పెద్ద ఎనర్జీ అవసరం కూడా లేదు. చేతులను అన్ని కోణాల్లోనూ తిప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా తలపైకి ఎత్తడం ఇందులో ఒకటి. నిజానికి మన సాధారణ జీవితంలో చేతులు పైకి ఎత్తడాన్ని కూడా చాలా మంది మర్చిపోతున్నారు.
Japan
5 minute exercise
longest living
Radio taiso

More Telugu News