Nikhil: ఎలాంటి మార్పు లేదు .. అదే రోజున రానున్న 'స్పై'

Spy release date confirmed
  • నిఖిల్ హీరోగా రూపొందిన 'స్పై'
  •  ఆయన జోడీకట్టిన ఐశ్వర్య మీనన్ 
  • సంగీతాన్ని సమకూర్చిన శ్రీచరణ్ పాకాల 
  • ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల
నిఖిల్ హీరోగా .. యాక్షన్ థ్రిల్లర్ గా 'స్పై' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నిఖిల్ జోడీగా ఐశ్వర్య మీనన్ అలరించనుంది. 2012లోనే తన కెరియర్ ను మొదలెట్టిన ఐశ్వర్య మీనన్ కి ఇది ఫస్టు తెలుగు సినిమా. 

'కార్తికేయ 2' సినిమాతో నిఖిల్ 100 కోట్ల హీరో అనిపించుకున్నాడు. పాన్ ఇండియా సినిమాలను ఆయనపై ప్లాన్ చేయవచ్చనే ఒక నమ్మకాన్ని కలిగించాడు. అలా రూపొందిన సినిమానే 'స్పై'. ఈ సినిమాను జూన్ 29వ తేదీన విడుదల చేయనున్నట్టు కొంతకాలం క్రితమే ప్రకటించారు. 

అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చనీ .. బ్యాలెన్స్ వర్క్ చాలానే ఉందనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ సినిమాను ముందుగా చెప్పిన తేదీనే విడుదల చేయనున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. పుకార్లకు తెరదించే ప్రయత్నంలో భాగంగా, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.
Nikhil
Aishwarya Menon
Garry BH
Spy Movie

More Telugu News