Devineni Uma: మేం కట్టిన ఇళ్లకు మీరు రంగులేసుకున్నారు.. వైసీపీపై దేవినేని ఉమ ఫైర్

TDP Leader Devineni Uma Slams YCP MLA Kodali Nani
  • రంగులేసే వారిని పెయింటర్లు అంటారని ఉమ ఎద్దేవా
  • టీడీపీ హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మించామన్న టీడీపీ నేత
  • మీరెన్ని కట్టారో చెప్పాలని డిమాండ్
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేతలపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడ సమీపంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నిన్న ఉమ మాట్లాడుతూ.. తాము కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులేసుకుని తాము నిర్మించినట్టు ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు. 

టిడ్కో ఇళ్లను టీడీపీ నిర్మించిన విషయం కొడాలి నానికి తెలియదా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మూలన పడేసిన ఇళ్లను ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా రంగులేసి తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. భవనాలు నిర్మించిన వారిని బిల్డర్లు అంటారని, రంగులేసే వారిని పెయింటర్లు అంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మించామని, నాలుగేళ్లలో వైసీపీ కట్టిన ఇళ్లు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు.
Devineni Uma
Kodali Nani
TDP
TIDCO Houses

More Telugu News