Varla Ramaiah: చంద్రబాబును జోగి రమేశ్ విమర్శించడం ఏపీ మంత్రి మండలికే సిగ్గు చేటు: వర్ల రామయ్య

Varla Ramaiah take a swipe at AP ministers

  • చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ వ్యాఖ్యలు
  • బూతుల మంత్రి పోయాడనుకుంటే అతడిని మించిపోతున్నారని వర్ల రామయ్య విమర్శలు
  • మంత్రుల ప్రవర్తనను సీఎం గమనించాలని హితవు

తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఖండించారు. చంద్రబాబును జోగి రమేశ్ విమర్శించడం రాష్ట్ర మంత్రి మండలికే సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఒక బూతుల మంత్రి పోయాడులే అనుకుంటే, అతడిని మించిపోయేలా మరొకరు తయారయ్యారని వర్ల రామయ్య విమర్శించారు. 

సీఎం అప్రయోజకత్వానికి ఆ పార్టీ విష సంస్కృతి ఓ నిదర్శనం అని అభివర్ణించారు. ఇప్పటికైనా జగన్ తన మంత్రుల ప్రవర్తనను గమనించాలని హితవు పలికారు. మంత్రుల అశ్లీల, అసభ్య పదప్రయోగాలు ముఖ్యమంత్రి నాయకత్వలేమిని సూచిస్తాయని వర్ల రామయ్య స్పష్టం చేశారు. నైతిక విలువలు ఉన్నవాడైతే జోగి రమేశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Varla Ramaiah
Chandrababu
Jogi Ramesh
Jagan
AP Cabinet
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News