Rahul Gandhi: రాహుల్ గాంధీని లాడెన్ తో పోల్చిన బీహార్ బీజేపీ నేత!

Bihar BJP chief Samrat Choudhary likens Rahul Gandhi to Osama bin Laden
  • రాహుల్ గాంధీ గడ్డం పెంచుకున్నంత మాత్రాన ప్రధాని కాలేరని ఎద్దేవా
  • రాహుల్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని వ్యాఖ్య
  • రాజకీయాల్లో ఆయన 50 ఏళ్ల చిన్నపిల్లాడని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి విమర్శలు గుప్పించారు. ఎవరైనా గడ్డం పెంచుకున్నంత మాత్రాన ప్రధానమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. గత తొమ్మిది ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు అరారియాలో మీడియాను ఉద్దేశించి మాట్లాడిన చౌదరి... గడ్డం పెంచుకొని ప్రధాని కావాలని రాహుల్ కలలు కంటున్నారన్నారు. కానీ అంతమాత్రాన ప్రధాని కాలేరన్నారు. లాడెన్ లాగా గడ్డం పెంచుకుంటూ, దేశంలో తిరుగుతున్నంత మాత్రాన ఇది రాహుల్ ను ప్రధానిని చేయలేదన్నారు. రాజకీయాల్లో ఆయనను 50 ఏళ్ల పిల్లవాడిగా భావిస్తున్నట్లు చెప్పారు.
Rahul Gandhi
Bihar
BJP

More Telugu News