mallu ravi: పొంగులేటి నుంచి ఈ నెల 12న ప్రకటన: మల్లు రవి వ్యాఖ్య

Ponguleti will announce his decision says mallu ravi

  • మల్లు రవిని కలిసిన దామోదర రెడ్డి, జూపల్లి
  • రాజకీయ పునరేకీకరణలో భాగంగా చర్చలు జరిపినట్లు వెల్లడి
  • కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత లేదన్న పార్టీ నేత

ఈ నెల 12వ తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశముందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. శనివారం మల్లు రవిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు కలిశారు. అనంతరం మల్లు రవి మాట్లాడారు. 

రాజకీయ పునరేకీకరణలో భాగంగానే చర్చలు జరిగినట్లు చెప్పారు. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డితోనూ చర్చిస్తామన్నారు. ఇప్పటికే ఆయనతో జానారెడ్డి చర్చించారన్నారు. జూపల్లితోను చర్చించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత లేదన్నారు.

mallu ravi
Congress
  • Loading...

More Telugu News