Team India: టీమిండియా ముందు భారీ టార్గెట్... అప్పుడే ఒక వికెట్ పడింది!

Team India loses 1st wicket in 444 runs chasing

  • డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ టార్గెట్ 444 పరుగులు
  • 41 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత్
  • 18 పరుగులు చేసి అవుటైన గిల్

డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా జట్టు 444 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా... లంచ్ విరామం తర్వాత ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 270 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్ కు 443 పరుగుల ఆధిక్యం లభించింది. 

కంగారూ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ స్టార్క్ కీలక ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ ఆధిక్యం పెరిగేందుకు సహకరించాడు. స్టార్క్ 57 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. లబుషేన్ 41, స్మిత్ 34, హెడ్ 18, గ్రీన్ 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 3, షమీ 2, సిరాజ్ 1, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీశారు. 

అనంతరం 444 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన భారత్ 7.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 18 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Team India
Australia
Chasing
WTC Final
The Oval
London
  • Loading...

More Telugu News