Daggubati Purandeswari: నాలుగేళ్లుగా ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకు తెలుసు: పురందేశ్వరి

Purandeswari attends Srikalahasti meeting

  • శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ సభ
  • హాజరైన జేపీ నడ్డా, పురందేశ్వరి తదితరులు
  • పాలకుడు తనకు తోచినట్టుగా చేయకూడదన్న పురందేశ్వరి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ బహిరంగసభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విచ్చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర నేతలు సత్యకుమార్, కిరణ్ కుమార్ రెడ్డి, టీజీ వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సభలో పురందేశ్వరి ప్రసంగిస్తూ... ఏపీలో గత నాలుగేళ్లుగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తమకు తెలుసని అన్నారు. పాలకుడు తనకు తోచినట్టు చేయకూడదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రజాహితాన్ని కాంక్షించి మాత్రమే పాలకుడు పనిచేయాలని పురందేశ్వరి హితవు పలికారు. 

అధికారాన్ని సేవా మార్గంగా ఉపయోగించుకునే పార్టీ బీజేపీ అని ఉద్ఘాటించారు. అంత్యోదయ... సబ్ కా వికాస్ అనేది బీజేపీ మూల సిద్ధాంతం అని పేర్కొన్నారు. గతంలో  రోజుకో స్కాం గురించి పత్రికల్లో చదివేవాళ్లమని, ఇప్పుడు పత్రికల్లో రోజుకో స్కీమ్ గురించి చదువుతున్నామని తెలిపారు.

Daggubati Purandeswari
Srikalahasti
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News