Nagababu: పసివాడుగా ఉన్నప్పుడు నేను నడక నేర్పించాను... ఇప్పుడు అతడి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను: నాగబాబు

Nagababu tweets about his brother Pawan Kalyan

  • నిన్న నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్ నిశ్చితార్థం
  • హాజరైన పవన్ కల్యాణ్
  • తమ్ముడి గురించి ఆసక్తికర ట్వీట్ చేసిన నాగబాబు

మెగాబ్రదర్ నాగబాబు తన నివాసంలో శుక్రవారం రాత్రి తన కుమారుడు వరుణ్ తేజ్ నిశ్చితార్థం కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు నాగబాబు సోదరుడు పవన్ కల్యాణ్ కూడా విచ్చేశారు. బ్లూ డెనిమ్ పాంట్స్ లో కాటన్ షర్ట్ టక్ చేసి వచ్చిన పవన్ కల్యాణ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో, నాగబాబు తన తమ్ముడి గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. 

"అతడు పసివాడుగా ఉన్నప్పుడు నడక నేర్పించాను... ఏది తప్పు, ఏది ఒప్పు అని మార్గదర్శనం చేశాను. ఇప్పుడు మేం పెద్దవాళ్లం అయ్యాం. సరైన పంథాలో వెళ్లడానికి అవసరమైన లోతైన అవగాహనను అతడు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నేను అతడి అడుగుజాడల్లో నడుస్తున్నాను" అని వివరించారు. 

అంతేకాదు, వరుణ్ తేజ్ నిశ్చితార్థం ఫంక్షన్ లో పవన్ తో కలిసున్నప్పటి ఫొటోను కూడా నాగబాబు పంచుకున్నారు. పవన్ ముందు నడుస్తుండగా, వెనుకగా నాగబాబు నడుస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు.

నాగబాబు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్న నాగబాబు ఇటీవలే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ పొందారు.

Nagababu
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News