Upasana: తోడికోడలు లావణ్యకు స్వాగతం: ఉపాసన

  • గతరాత్రి హైదరాబాదులో వరుణ్ తేజ్-లావణ్య నిశ్చితార్థం
  • హాజరైన రామ్ చరణ్, ఉపాసన
  • ప్రియాతి ప్రియమైన లావణ్య అంటూ ఉపాసన ట్వీట్
Upasana welcoms Lavanya into Konidela family

టాలీవుడ్ ప్రేమ జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో ఓ ఇంటివారు కానున్నారు. గత రాత్రి వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, ఉపాసన కూడా హాజరయ్యారు. కాబోయే దంపతులకు విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో, ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

"ప్రియాతి ప్రియమైన లావణ్య... కొణిదెల కుటుంబంలోకి స్వాగతం. నాకు అత్యంత ఇష్టమైన తోడికోడలితో వేడుక చేసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. వరుణ్ నీ నిశ్చితార్థం పట్ల చాలా సంతోషంగా ఉంది" అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. రామ్ చరణ్, తాను... వరుణ్ తేజ్-లావణ్యతో దిగిన ఫొటోను కూడా ఉపాసన పంచుకున్నారు. కాగా, వరుణ్ తేజ్, లావణ్యల వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుందని తెలుస్తోంది. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసిన నటించిన వరుణ్ తేజ్, లావణ్య గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు.

More Telugu News