Uttar Pradesh: యూపీలో దారుణం.. గుర్రాలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి యువతిపై నాలుగు రోజులపాటు అఘాయిత్యం!

sensational crime in Uttar Pradesh Kanpur

  • దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపు
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా తగ్గని నిందితుడు
  • ఫోన్ చేసి యాసిడ్ పోస్తానని బెదిరింపు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఓ కామాంధుడు దారుణానికి తెగబడ్డాడు. శునకాలు, గుర్రాలకు ఇచ్చే ఇంజెక్షన్ ఇచ్చి యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఫజల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిద్వాయ్‌నగర్‌కు చెందిన అర్జున్‌సింగ్ ఓ షోరూములో పనిచేసే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఓసారి కలుద్దామని చెప్పి పిలిచాడు. ఆ తర్వాత శునకాలు, గుర్రాలకు చేసే ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

నాలుగు రోజులపాటు ఆమెను బందీగా ఉంచుకుని పలుమార్లు అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసిన నిందితుడు విషయాన్ని బయటపెడితే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, చంపేస్తానని బెదిరించి విడిచిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి రావాలని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా సరే ఏమాత్రం తగ్గని నిందితుడు ఈ నెల 6న వేర్వేరు నంబర్ల నుంచి బాధితురాలికి ఫోన్ చేసి తన మాట వినకుంటే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి.

Uttar Pradesh
Kanpur
Crime News
  • Loading...

More Telugu News