Punch Prasad: పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి

AP CM Special Secretary responds to Punch Prasad health condition

  • జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కు తీవ్ర అనారోగ్యం
  • రెండు కిడ్నీలు పాడైన వైనం
  • ఇటీవల క్షీణించిన ఆరోగ్యం
  • ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శిని ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టిన పంచ్ ప్రసాద్ స్నేహితులు

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కు మూడేళ్ల కిందట రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఇటీవల ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో అతడి స్నేహితులు ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు పెట్టారు.  దీనిపై సీఎం ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ వెంటనే స్పందించారు. 

పంచ్ ప్రసాద్ కు తమ వంతు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అతడికి కిడ్నీ మార్పిడికి సహకారం అందిస్తామని తెలిపారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరుగుతోందని, దీనికి సంబంధించి తమ బృందం పంచ్ ప్రసాద్ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని హరికృష్ణ వెల్లడించారు. పత్రాలు పరిశీలించడం పూర్తయిన వెంటనే సాయానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Punch Prasad
Kidney
Harikrishna
Special Secretary
AP CM
Jabardasth
  • Loading...

More Telugu News