Apsara: అప్సర హత్య కేసులో ఆసక్తికర అంశాల వెల్లడి

Apsara murder case details

  • హైదరాబాదులో యువతి హత్య
  • ప్రియుడు సాయికృష్ణే నిందితుడు
  • ఓ గుడిలో పూజారిగా పనిచేస్తున్న సాయికృష్ణ
  • సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన అప్సర
  • ఆలయంలో పరిచయం... వివాహేతర సంబంధంగా మారిన వైనం

వివాహేతర సంబంధం నేపథ్యంలో హైదరాబాదులో అప్సర అనే యువతిని పూజారి సాయికృష్ణ హత్య చేయడం తెలిసిందే. పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అప్సర పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే సాయికృష్ణ ఆమెను అంతమొందించాడని పోలీసులు తెలిపారు. 

పూజారి సాయికృష్ణ వివాహితుడు. అతడికి 2010లో వివాహం జరగ్గా, ఓ పాప ఉంది. సాయికృష్ణ స్వస్థలం ఏపీలోని గన్నవరం మండలం నరేంద్రపురం. అప్సర స్వస్థలం తమిళనాడు. డిగ్రీ పూర్తి చేసిన అప్సర చెన్నైలో కొన్ని చిన్న సీరియళ్లలో నటించింది. సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చింది. 

అప్సర ఓసారి సాయికృష్ణ పూజారిగా పనిచేస్తున్న ఆలయానికి వచ్చింది. ఆమెతో పరిచయం పెంచుకున్న సాయికృష్ణ సినిమా అవకాశాల పేరిట ఆమెకు మరింత దగ్గరయ్యాడు. ఆ విధంగా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 

సాయికృష్ణకు పెళ్లయిందని తెలిసినా, తనను వివాహం చేసుకోవాల్సిందేనని అతడిని ఒత్తిడి చేసింది. అప్సర వైఖరితో ఆందోళన చెందిన సాయికృష్ణ ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పక్కా ప్లాన్ తో ఆమెను హత్య చేశాడు. సుల్తాన్ పల్లిలో ఆమెను చంపి, సరూర్ నగర్ లోని మ్యాన్ హోల్ లో పడేశాడు. సాయికృష్ణ గతంలోనూ ఓసారి అప్సరను చంపేందుకు ప్లాన్ రూపొందించాడు.

Apsara
Saikrishna
Hyderabad
Police
  • Loading...

More Telugu News