Varun Tej: నాగబాబు నివాసంలో ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం

Varun Tej engagement with Lavanya Tripathi held at Nagababu residence

  • గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య
  • ప్రేమకు పెద్దల గ్రీన్ సిగ్నల్
  • నేడు హైదరాబాదులో నిశ్చితార్థం

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాలనటి లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈ సాయంత్రం హైదరాబాదులోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు విచ్చేశారు. తమ ఇంట జరుగుతున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ తదితరులు విచ్చేశారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు తెలిసింది. అయితే, ఒక ఏడాది కాలం నుంచే మీడియాలో వీరి లవ్ అఫైర్ ప్రముఖంగా కనిపించడం మొదలైంది. కాగా, అంతరిక్షం అనే చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నటించారు.

Varun Tej
Lavanya Tripathi
Engagement
Nagababu
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News