wrestlers: మా ఇంటికి ఎవరూ రాలేదు: రెజ్లర్ తో సీన్ రీక్రియేషన్‌పై బ్రిజ్ భూషణ్

  • లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్
  • శుక్రవారం మధ్యాహ్నం సీన్ రీక్రియేట్ చేసినట్లు వార్తలు
  • ఒక మహిళా రెజ్లర్ ను ఆయన ఇంటికి తీసుకు వెళ్లినట్లు ప్రచారం
  • సీన్ రీక్రియేషన్ వార్తలను ఖండించిన బ్రిజ్
Brij bhushan singh on amid reports of wrestlers being taken to his residence

లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ ఇంటి వద్ద ఢిల్లీ పోలీసులు సీన్ రీక్రియేట్ చేసినట్లుగా వచ్చిన వార్తలపై బీజేపీ ఎంపీ, డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు స్పందించారు. తమ ఇంటికి మహిళా రెజ్లర్లు ఎవరూ రాలేదని, పోలీసులు ఎలాంటి సీన్ రీక్రియేట్ చేయలేదని పేర్కొన్నారు. అంతకుముందు బ్రిజ్ భూషణ్ ఇంటి వద్ద సీన్ రీక్రియేట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. 

తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పోలీసులు ఆయన ఇంటికి ఓ మహిళా రెజ్లర్ ను తీసుకువెళ్లి, అక్కడ సీన్ రీక్రియేట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ఢిల్లీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి పోలీసులు మహిళా రెజ్లర్ ను తీసుకు వెళ్లారని, ఆమె వెంట మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారని, దాదాపు అరగంట పాటు పోలీసులు అక్కడే ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆ నివాసంలో ఎక్కడెక్కడ వేధింపులకు గురైందో గుర్తుకు తెచ్చుకొని సీన్ ను రీక్రియేట్ చేయాలని పోలీసులు ఆమెను అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే సీన్ రీక్రియేషన్ కోసం ఎవరూ తమ ఇంటికి రాలేదని బ్రిజ్ భూషణ్ చెప్పారు.

More Telugu News