shark: కళ్లముందే కొడుకును తినేసిన సొరచేప... అంతా 20 సెకండ్లలోనే

shark kill Russian youth in 20 seconds

  • ఈజిప్ట్ బీచ్ లో రష్యా కుటుంబం పర్యటన.. బీచ్ లో ఈతకు దిగిన తనయుడు
  • అటువైపుగా వచ్చిన షార్క్ దాడి...
  • డాడీ కాపాడు అంటూ కేకలు వేసిన యువకుడు
  • ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చే ప్రయత్నం
  • చివరికి షార్క్ నుండి తప్పించుకోలేక మృతి

బీచ్ లో ఈదుతున్న ఓ యువకుడ్ని షార్క్ చేప తినేసిన ఘటన ఈజిప్ట్ లో జరిగింది. రష్యాకు చెందిన ఇరవై మూడేళ్ల పోపోవ్ తన కుటుంబంతో కలిసి ఈజిప్ట్ ను సందర్శించాడు. ఇందులో భాగంగా ఎర్రసముద్రం తీరంలోని ఓ రిసార్ట్ లో బస చేసి గురువారం తన ప్రియురాలితో కలిసి ఈత కొట్టాడు. ఇంతలో అక్కడకు వచ్చిన టైగర్ షార్క్ పోపోవ్ ను సమీపించి అతడిపై దాడి చేసింది. డాడీ.. నన్ను కాపాడు అంటూ అతను కేకలు వేశాడు. ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ షార్క్ నుండి తప్పించుకోలేకపోయాడు. ఆ యువకుడ్ని షార్క్ నమిలి మింగేసింది. ఆ శరీరంతో రెండు గంటల పాటు ఆడుకుంది! అయితే అతని ప్రియురాలు మాత్రం షార్క్ నుండి తప్పించుకుంది.

కళ్లముందే తన కొడుకును తినేయడంతో తండ్రి షాక్ కు గురయ్యాడు. ఇతర పర్యాటకులు కూడా వణికిపోయారు. తాము రిలాక్స్ అయ్యేందుకు బీచ్ కు వెళ్లామని, ఆ సమయంలో తన కొడుకును షార్క్ అటాక్ చేసిందని, ఇదంతా కేవలం సెకండ్ల వ్యవధిలో జరిగిందని మృతుని తండ్రి చెప్పాడు. తన కొడుకును కేవలం 20 సెకండ్లలోనే ఆ షార్క్ నమిలి తినేసిందని, అతనిని నీళ్లలోకి తీసుకువెళ్లిందని చెప్పాడు. అది అనుకోకుండా జరిగిన దుర్ఘటన అని, ఎందుకంటే ఈ బీచ్ చాలా సురక్షితమైనదని కూడా చెప్పాడు. కాగా యువకుడ్ని తినేసిన షార్క్ ను పట్టుకున్నట్లు ఈజిప్ట్ పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నీటిలోకి దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిషేధిత బీచ్‌లలో ఈతకు దిగవద్దని ఈజిప్ట్ సూచించింది.

shark
egypt
Russia
  • Loading...

More Telugu News